కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు.
కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు మాజీ మేయర్ రవీందర్ సింగ్ పై ధ్వజమెత్తారు. రవీందర్ సింగ్ పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. రవీందర్ సింగ్ అవకాశవాద రాజకీయాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాడన్నారు సునీల్ రావు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా అంశం ఆయన నైతికతకే వదిలేస్తున్నాం. గత సంవత్సర కాలంగా 2023లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అన్నది నిజం కాదా? ఏ ఎన్నిక వస్తే ఆ ఎన్నికల్లో అవకాశం కావాలి అనడం అత్యాశ.…