ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు వేరే లెవెల్స్ లో ఉంటాయి. ఈ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.హ్యాట్రిక్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పని చేయబోతుంది. ఇటీవలలే వీరి కాంబోలో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ చేసిన నాటి నుంచి అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.. ఇక ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.
ఈ సినిమా కథ పీరియాడిక్ డ్రామా గా ఉంటుంది అని తెలుస్తుంది. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం.ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ”పుష్ప ది రూల్” చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగానే పూర్తి అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుతో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నారు. మరి వీరిద్దరి కాంబో లో రాబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియాల్సి ఉంది.రీసెంట్ గా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సాధించాడు. దీనితో అల్లు అర్జున్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇక నుంచి అల్లు అర్జున్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందనున్నాయి.