మరో మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో తోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారాలు సాగించాయి. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక వరాలను కురిపించారు. ఈసారి ఎన్నికల్లో కాస్త సినీ గ్లామర్ ఎక్కువగా కనబడుతోంది.
Also Read: RamCharan: రేపు పిఠాపురానికి రాంచరణ్.. చివరి రోజు షాకింగ్ ట్విస్ట్..?
ఇక అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మామ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ అభిమానులు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇకపోతే అందిన సమాచారం మేరకు.. అల్లు అర్జున్ స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు తన భార్య స్నేహ రెడ్డితో రేపు ఉదయం నంద్యాలకు చేరనున్నారు.
Also Read: Rahul Gandhi: రేపు ఇడుపులపాయకు రాహుల్ గాంధీ.. కడపలో బహిరంగ సభ..
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎలక్షన్ క్యాంపెయిన్ తన భార్యతో కలిసి చేస్తాడా లేదన్న విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా తన స్నేహితుడి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. చూడాలి మరి శనివారం నాడు అల్లు అర్జున్ తన భార్యతో కలిసి నంద్యాలలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తాడో లేదో.