Allu Cinemas: ‘ధురంధర్ 2’తో.. ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Cinemas: సినీ ప్రేమికులకు, ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని కోరుకునే ఆడియన్స్‌కి శుభవార్త. హైదరాబాద్‌లోని కోకాపేట్లో ఏర్పాటవుతున్న అల్లు సినిమాస్ థియేటర్ దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌తో గ్రాండ్‌గా ఓపెన్ కానుంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కి వాళ్లు సెలెక్ట్ చేసుకున్న సినిమా.. థియేటర్ ఓపెనింగ్‌పై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా ఏంటో తెలుసా.. అదే ‘ధురంధర్ 2’. అదిత్య ధర్ దర్శకత్వంలో రన్వీర్ సింగ్ మెయిన్ రోల్లో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రిలీజ్‌తోనే అల్లు సినిమాస్‌లోని భారీ 75 అడుగుల వెడల్పు డాల్బీ సినిమా స్క్రీన్ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
READ ALSO: PM MODI: ‘‘ మలేషియా ప్రధాని ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని’’.. మోడీ పర్యటనలో తమిళ సాంగ్..
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో పాటు ప్రపంచ స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని ఇక్కడ అందించనున్నారు. ‘ధురంధర్: ది రివెంజ్’ మొదటి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగం మరింత భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తోంది. ఈ సీక్వెల్‌కు ఇప్పటికే భారీ ప్రీ-రిలీజ్ డీల్స్ జరిగాయని టాక్ నడుస్తుంది. ఈద్, ఉగాది వంటి పండుగల సమయంలో ఈ సినిమా రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ సందడి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అల్లు స్టూడియోస్ క్యాంపస్‌లోనే ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ ఏర్పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పశ్చిమ భాగంలోని సినీ ప్రియులకు ఇది భారీ బహుమతిగా మారనుంది. డాల్బీ సినిమా ఫార్మాట్లో దేశంలోనే అతి పెద్ద స్క్రీన్ కావడం, అదనంగా అధునాతన సౌకర్యాలతో థియేటర్ సెటప్ చేయడం, ఇవన్నీ కలిసి సినిమా చూడటానికి కొత్త లెవల్‌కు తీసుకెళ్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం థియేటర్ ఓపెనింగ్ కోసం కొన్ని పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. ఆ అనుమతులు అనుకున్న సమయానికి వస్తే ధురంధర్ 2 సినిమాతోనే అల్లు సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందని ప్రస్తుతం టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Airport Customs Rules: విదేశాల్లో నుంచి సుంకం లేకుండా ఎంత బంగారం తెచ్చుకోవచ్చు తెలుసా!
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!