Allu Arjun : వరుణ్ – లావణ్య పెళ్లి కోసం కుటుంబ సమేతంగా ఇటలీ బయలుదేరిన ఐకాన్ స్టార్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలో నవంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు కొణిదెల మరియు అల్లు కుటుంబ సభ్యులు అందరూ హాజరుకానున్నారు.. మెగా, అల్లు హీరోలు వారి కుటుంబ సభ్యులతో వివాహ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.ఇప్పటికే కొణిదెల, అల్లు కుటుంబాల్లో వివాహ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. వరుణ్, లావణ్య పెళ్లికి హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (అక్టోబర్ 28) ఇటలీకి బయలుదేరారు.అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా నేడు ఇటలీకి బయలుదేరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వారు విమానం ఎక్కారు. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి మరియు వారి పిల్లలు అయాన్, ఆర్హ ఇటలీకి వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలోకి వీరు కనిపించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
అల్లు అర్జున్ బ్లాక్ ఔట్ఫిట్ ధరించారు. ఫుల్ స్లీవ్డ్ టీ షర్ట్, బ్లాక్ జాగర్స్, స్నీకర్స్ వేసుకున్నారు. స్నేహారెడ్డి.. డెనిమ్ జాకెట్, డెనిమ్ ప్యాంట్స్, బ్లాక్ క్రాప్ టాప్ ధరించారు.వరుణ్, లావణ్య వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన భార్య అన్న లెజనోవాతో కలిసి ఇటలీ వెళ్లారు. అలాగే యంగ్ హీరో నితిన్, అతడి భార్య షాలినీ కూడా విమానాశ్రయంలో కనిపించారు.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు టస్కానీలో అక్టోబర్ 30వ తేదీ నుంచే మొదలుకానున్నాయి. ఆరోజున కాక్ టైల్ పార్టీ ఉంటుందత. అక్టోబర్ 31న మెహందీ మరియు హల్దీ వేడుకలు జరుగుతాయి. నవంబర్ 1న వివాహం జరుగుతుంది.కొణిదెల, అల్లు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు హాజరుకానున్నారని తెలుస్తుంది.నవంబర్ 5వ తేదీన వరుణ్,లావణ్య వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ రిసెప్షన్‌కు అనేక మంది సినీ, రాజకీయ మరియు పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు.ఆరేళ్ల పాటు ఎంతగానో ప్రేమించుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు..
Also Read
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..