Allu Arjun: పోలీసుల నోటీసులు.. లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ భేటీ
- లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ భేటీ
- రేపటి విచారణలో పోలీసు అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలపై చర్చ
- లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్న అల్లు అర్జున్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. తమ లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ సమావేశమయ్యారు. పోలీసుల తాజా నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. రేపు విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చిస్తున్నారు. తమ లీగల్ టీమ్ నుంచి లీగల్ ఒపీనియన్‌ను అల్లు అర్జున్ తీసుకుంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు అందించారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న లీగల్ టీమ్ సభ్యులు.. పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చ జరుపుతున్నారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను రేపు పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది.
https://www.youtube.com/watch?v=ITqubGCDny8&t=188s
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!