Allu Arjun: సంక్రాంతి.. చిన్నా, పెద్ద.. ముసలి, ముతకా.. పెద్ద, ధనిక తేడాలు లేవు. అందరు కలిసి చేసుకొనేదే సంక్రాంతి పండుగ. కొత్త అల్లుళ్లతో అత్తగారిళ్లు మెరిసిపోతున్నాయి. పిండి వంటలు, గాలిపటాలు, బావబామ్మర్దుల ఆటలు. పిల్లల అల్లరితో ప్రతి కుటుంబం సంక్రాంతిని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంబరాలకు ప్రముఖులు కూడా అతీతం కాదు. తాజాగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంచక్కా కుటుంబంతో కలిసి అత్తగారింటికి వెళ్లి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న బన్నీ సంక్రాంతికి షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి అత్తగారింట ప్రత్యక్షమయ్యాడు. అల్లు స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
Mamatha Mohandas: ఎన్టీఆర్ హీరోయిన్ కే ఎందుకు ఇన్ని కష్టాలు
బన్నీ కూడా ఈ సంబరాల్లో యాడ్ అయ్యేసరికి మరింత ఆనందం ఆ కుటుంబంలో వెల్లివిరిసింది. స్నేహ కుటుంబంతో పాటు ఆమె చెల్లి కుటుంబం కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వీరిలో పుష్ప రాజ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారదు. వైట్ కలర్ కుర్తా.. లాంగ్ హెయిర్ తో పుష్పరాజ్ లుక్ తోనే కనిపించాడు. ఎల్లో కలర్ డ్రెస్ లో స్నేహ ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిసిపోగా.. అల్లు వారసులు అయాన్, అర్హ ఎరుపు రంగు దుస్తుల్లో ఎంతో అందంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలను అల్లు అర్జున అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.