Allu-Arjun : హీరో రెమ్యునరేషన్ అంటే ఇలా ఉండాలి! బన్నీ చూపించిన కొత్త దారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా అగ్ర హీరోలు సినిమా ప్రారంభానికి ముందే భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తారు. ప్రజంట్ ఈ విషయంలో హీరోలు బాగానే వసులు చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప-2: ది రూల్’ కోసం ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సినిమాకు జరిగిన మొత్తం బిజినెస్‌లో (థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి) ఆయన దాదాపు 27 శాతం నుంచి 30 శాతం వరకు వాటాను తన రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌నే సుమారు రూ. 1000 కోట్లకు పైగా జరగడంతో, బన్నీ ఆదాయం ఏకంగా రూ. 270 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు చేరుకుందట. ఇది ఒక భారతీయ హీరోకు దక్కిన అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో ..
Also Read :Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక ట్రిపుల్ ధమాకా.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్!
Also Read
అదే ఫార్ములా కంటిన్యూ అవుతున్న బన్నీ.. ఇప్పుడు తన తదుపరి చిత్రాలకు కూడా ఇదే ‘బిజినెస్ షేరింగ్’ మోడల్‌ను అనుసరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీ తో (AA22) ఒక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సుమారు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం బన్నీకి రూ. 175 కోట్ల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌తో పాటుగా.. లాభాల్లో 15 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీనివల్ల సినిమా సక్సెస్ అయితే ఆయన ఆదాయం రూ. 300 కోట్లు దాటే అవకాశం ఉంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్‌తో (AA23) చేయబోయే సినిమాకు కూడా మైత్రీ మూవీ మేకర్స్ ఇదే తరహా భారీ డీల్‌ను కుదుర్చుకున్నారట. ఇలా సినిమా రిస్క్.. సక్సెస్‌లో భాగస్వామిగా మారుతూ అల్లు అర్జున్ సెట్ చేసిన ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు ఇతర స్టార్ హీరోలను కూడా ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్‌లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!