Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హ్యాపీ రీ Allu Arjun Happy: దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ముఖ్యంగా కేరళ (మల్లూవుడ్) ప్రేక్షకులతో ఆయనకు ఉన్న బంధం ఈనాటిది కాదు. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ‘ఆర్య’, ‘హ్యాపీ’, ‘బన్నీ’, ‘దేశముదురు’ వంటి చిత్రాల మలయాళ డబ్బింగ్ వెర్షన్లతోనే బన్నీ అక్కడ ఒక సెన్సేషన్. తాజాగా కేరళలో రీ-రిలీజ్ అయిన ‘హ్యాపీ’ (మలయాళంలో ‘హ్యాపీ బీ హ్యాపీ’) అక్కడ సృష్టించిన ప్రభంజనం చూస్తే.. అల్లు అర్జున్ క్రేజ్ కేవలం ‘పుష్ప’ ఫ్రాంచైజీ వల్ల వచ్చింది కాదని, రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో పాతుకుపోయిన అభిమాన సామ్రాజ్యం అని మరోసారి నిరూపితమైంది.
ఒక పరభాషా నటుడి పాత డబ్బింగ్ సినిమా రీ-రిలీజ్ అయితే థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం, అదీ 19 ఏళ్ల క్రితం నాటి చిత్రానికి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ‘హ్యాపీ’ రీ-రిలీజ్ సందర్భంగా కేరళలోని థియేటర్లు పెళ్లి పందిళ్లను తలపించాయి. తెలుగు రాష్ట్రాల్లో లానే స్క్రీన్ ముందు ఫ్యాన్స్ చేసిన డ్యాన్సులు, హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ మార్క్ కామిక్ టైమింగ్, మేనరిజమ్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు మలయాళీలు థియేటర్లలో ఈలలు, గోలలతో హోరెత్తించారు.
Also Read
- Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
- Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు...
- Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
- Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్‌లో పోలిస్తే ఎంతంటే..?
అంతేకాక ఒకప్పుడు టీవీల్లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన తరం, ఇప్పుడు థియేటర్లలో ఆ జ్ఞాపకాలను మళ్లీ సెలబ్రేట్ చేసుకుంది అని అంటున్నారు. నిజానికి ఈ రోజు మాలీవుడ్‌లో రాణిస్తున్న ఎంతో మంది యువ హీరోలు, టెక్నీషియన్లు తాము చిన్నప్పుడు అల్లు అర్జున్ డ్యాన్సులు, స్టైల్, యాక్షన్ సీన్లు చూసి ఇన్స్పైర్ అయ్యామని బహిరంగంగానే చెబుతుంటారు. కేరళలోని ఒక తరానికి యాక్టింగ్, స్క్రీన్ చరిష్మా విషయంలో బన్నీ సినిమాలు ఒక బెంచ్ మార్క్ గా నిలిచాయి.
తాజావార్తలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్‌లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!