Allu Arjun : ఆ దర్శకుడితో అల్లు అర్జున్ బాలీవుడ్ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నాడు.సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. దీనితో దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు..ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 15 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్ కాంబో లో ఓ మూవీ ఫిక్సయినట్లు సోషల్ మీడియాలో పోస్టర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా కు కభీ అప్నే కభీ సప్నే అంటూ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు గా ఈ పోస్టర్స్‌లో కనిపిస్తోంది.ఈ పోస్టర్స్‌లో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తున్నాడు. ఒకటి క్లాస్, మరొకటి మాస్ లుక్ ల తో అతడి ముఖం సగం..సగం మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతుందని ఈ సినిమా తోనే అల్లు అర్జున్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రకరకాలుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పోస్టర్ వెనకున్న సీక్రెట్ ఏమిటన్నది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది.గతంలో క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వేదం సినిమా చేశాడు . మరోసారి వీరిద్దరి కాంబో సెట్ అయిందనే వార్తలు టాలీవుడ్‌లో ఎంతో హాట్‌టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ క్రిష్ కభీ అప్నే కభీ సప్నే పోస్టర్ మిస్టరీ పై త్వరలోనే ఒక క్లారిటీ రానున్నట్లు సమాచారం.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!