‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనం ఎక్కేముందు తండ్రి అల్లు అరవింద్, సతీమణి స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ మాట్లాడారు.
ప్రభుత్వం చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అల్లు అర్జున్ అరెస్ట్. బెనిఫిట్ షోకి హీరోలు వస్తారని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. -బండి సంజయ్
ఉ.11:45 నిమిషాలకు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు
మ.12 గంటలకు అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు
12:10PM కి బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ నిలదీసిన అల్లు అర్జున్
12:15 PMకి అల్లు అర్జున్ను అరెస్టు చేసిన పోలీసులు
12:20 PMకి జూబ్లీహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ తరలింపు
1 PM కు చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్ తరలింపు
1:15 PMకి రిమాండ్ రిపోర్టు రెడీ చేసిన పోలీసులు
2.00 PMకి గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్
2.15 PMకి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు మొదలు
2.30 PMకి అల్లు అర్జున్ నివాసానికి చిరు దంపతులు
3.00 PMకి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి
3.16 PMకి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
3.30 PMకి మేజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్
పోలీసులు వచ్చే సమయానికి స్విమ్మింగ్ పూల్ లో అల్లు అర్జున్.. పోలీసుల రాకతో అవాక్కైన బన్నీ.. కేసు హైకోర్టులో ఉన్నందున అరెస్ట్ ఊహించని అల్లు అర్జున్
నాంపల్లి కోర్డులో అల్లు అర్జున్. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు. కేసు వివరాలను పరిశీలిస్తున్న మేజిస్ట్రేట్.
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరు పరిచారు పోలీసులు. నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ను తరలించారు పోలీసులు.
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సీఎం రేవంత్.. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు.. చట్టం ముందు అందరూ సమానమే: సీఎం రేవంత్ రెడ్డి
పోలీసు వాహనంలో అల్లు అర్జున్ ను నాంపల్లి తరలిస్తున్న పోలీసులు
గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ వైద్య పరీక్షలు పూర్తి.. నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
అల్లు అర్జున్ ఇంటికి నాగబాబు చేరుకున్నారు
అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు చేరుకున్నారు. బన్నీ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారు.
అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ చేరుకున్నారు. బన్నీ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారు.
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణను తెలంగాణ హైకోర్టు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బన్నీని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అల్లు అర్జున్‌తో పాటు గాంధీ ఆసుపత్రికి నిర్మాత అల్లు అరవింద్ వచ్చారు. ఆసుపత్రిలో బన్నీకి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.
అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. నాంపల్లి కోర్టు దగ్గరకు పోలీసులు భారీగా చేరుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు.
చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ను పోలీసులు తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో బన్నీకి వైద్య పరీక్షలు చేయించనున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో చిక్కడపల్లి పీఎస్‌కు మెగాస్టార్ చిరంజీవి కాసేపట్లో చేరుకోనున్నారు. విషయం తెలిసిన వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన చిక్కడపల్లి పీఎస్‌కు వస్తున్నారు.
చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. బన్నీ వస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాసేపట్లో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్‌ను అల్లు అర్జున్ తరఫు న్యావాడి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30కి హైకోర్టు విచారించనుంది.
చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. పోలీసులు అభిమానులను అదుపు చేసేందుకు సిద్ధమయ్యారు.
అల్లు అర్జున్ను అరెస్ట్ కావడంతో నిర్మాత దిల్ రాజు చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్నారు.
అల్లు అర్జున్ను అరెస్ట్ చేశాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయనను అరెస్ట్ చేశామన్నారు.
అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ను సాధారణ నేరస్థుడిలా చూడడం సరికాదన్నారు. పాలకుల అభద్రతా భావానికి బన్నీ అరెస్టు తీరు ఓ నిదర్శనం అని విమర్శించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదని, ఆయన అరెస్టు తీరును ఖండిస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ మామ కె. చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్నారు.
అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బన్నీ ఇంటికి అభిమానులు భారీగా చేరుకున్నారు. అభిమానులను పోలీసులు చెదరగొడుతున్నారు.
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు శిరీష్‌లు చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్నారు.
అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
హీరో అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయింది.
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.