Allu Arjun with His Wife Sneha Reddy in Dhaba: ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆయన డైలాగులు, మేనరిజమ్స్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప 2తో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రకంపనలు సృష్టిస్తాడని అందరూ భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బయట ఎక్కడ కనిపించినా ఫాన్స్ భారీగా తరలివస్తారు. ఆయన్ను చూసేందుకు, కలిసి ఫొటోలు దిగేందుకు ఎగబడతారు. ఎంతో స్టార్ డమ్ ఉన్న బన్నీ.. ఓ దాబాలో సింపుల్‌గా భోజనం చేశాడు. తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి ఆయన లంచ్ చేశాడు. ఏపీ ఎన్నికల్లో నిలబడ్డ తన ఫ్రెండ్, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి రెడ్డికి సపోర్ట్ చేసేందుకు ఇటీవల నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్.. తిరిగొచ్చే క్రమంలోనే దాబాలో లంచ్ చేసినట్లు తెలుస్తోంది. అది ఉండవెల్లి సమీపంలో గురు నానక్ ధాబా అని సమాచారం.
Also Read: Bharateeyudu 2: ‘భారతీయుడు 2’ ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు!
అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలు దాబాలో భోజనం చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోస్ చూసిన ఫాన్స్ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘పాన్ ఇండియా స్టార్ అయ్యుండి.. సింపుల్‌గా దాబాలో భోజనం చేయడం గ్రేట్’, ‘అది మరి బన్నీ అన్న సింప్లిసిటీ’, ‘అల్లు అర్జున్ బ్రో.. నువ్ సూపర్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక కాగా.. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.