Bharateeyudu 2 1st Single to be out Tomorrow: 1996లో విలక్షణ నటుడు కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశాన్ని కేన్సర్‌లా పట్టిపీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పోరాటం చేశాడు. అవినీతిని అంతమొందించడానికి సొంత కుడుకునే సేనాపతి చంపేస్తాడు. ఈ సినిమాలో కమల్‌హాసన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. భారతీయుడు 2ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. సిద్ధార్థ్, ఎస్‌జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read: Bangalore Rave Party 2024: బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం.. కఠిన చర్యలు తప్పవు: బెంగళూరు సీపీ
భారతీయుడు 2 సినిమా జులై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటినుంచే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. జూన్ 1న చెన్నైలో ఈ చిత్ర పాటల వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది. అంతకుముందే భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్‌కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ‘సౌరా’ ప్రోమో ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతుందని, పూర్తి పాట రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ పాటకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు.
Get ready for a Promo of the 1st single “SOURAA” 🔪 from BHARATEEYUDU-2 🇮🇳 releasing today at 5️⃣ PM! Full Song dropping tomorrow at 5️⃣ PM!
Rockstar @anirudhofficial musical 🎹
Lyrics #SuddalaAshokTeja ✍🏻#Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @anirudhofficial… pic.twitter.com/JQtx2BRIoQ— Lyca Productions (@LycaProductions) May 21, 2024