NTV Telugu Site icon

Allu Arjun: రేవతి కుటుంబానికి అండగా ఉంటా.. పుష్పరాజ్ హామీ

Allu Arjun 2

Allu Arjun 2

Allu Arjun: సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. ఈ కేసులో శుక్రవారం అరెస్ట్‌ అయిన ఆయన.. బెయిల్‌ మంజూరు అయిన.. తగిన సమయానికి బెయిల్‌పత్రాలు జైలుకు చేరుకోకపోవడంతో.. చంచల్‌గూడ జైలులోనే గడపాల్సి వచ్చింది బన్నీ.. ఇక, ఈ రోజు ఉదయమే 6.30 గంటలకు జైలు నుంచి విడుదలైన బన్నీ.. నేరుగా గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌కు చేరుకున్నారు.. ఆ తర్వాత తన ఇంటికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.. వారిని ఓదార్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్‌.. సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు..

Read Also: Allu Arjun Press Meet: అరెస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్‌.. ఏమన్నారంటే..?

ఈ సమయంలో తనకు మద్దతు తెలిపిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్‌.. నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్న ఆయన.. అయితే, ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను అన్నారు.. కాగా, సంధ్య థియేటర్‌ దగ్గర తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.. పీఎస్‌లో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు.. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో ప్రవేశపెట్టారు.. అయితే, కోర్టు.. బన్నీకి 14 రోజుల రిమాండ్‌ విధించింది.. దాంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు.. కానీ, బెయిల్‌కు సంబంధించిన పత్రాలు సరైన సమయానికి జైలుకు చేరుకోకపోవడంతో.. రాత్రి జైలులోనే గడిపారు అల్లు అర్జున్.. అండర్ ట్రైల్ ఖైదీగా 7697 నంబర్‌ను బన్నీకి కేటాయించిన చంచల్‌గూడ జైలు అధికారులు.. మంజీర బ్యారక్ లో ఉంచారు. ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ తరపు లాయర్ రూ. 50 వేల పూచీకత్తును జైలు సూపరిండెంట్ కు సమర్పించిన తర్వాత జైలు నుంచి విడుదలైన విషయం విదితమే..

Show comments