Alleti Maheshwar Reddy : భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలి
- కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయని వ్యాఖ్య
- కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయన్నారు. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. మంత్రి మాట్లాడుతూ….భూముల విషయం మీ అంతరాత్మకు తెలుసు అని మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యలు ఇక్కడ కాక ఎక్కడ మాట్లాడతారు ? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు రికవరీ చేశారు ? అని ఆయన అన్నారు. గతంలో ఇది 2 లక్షల కోట్ల కుంభకోణం అంటూ ఆరోపణలు చేసారని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
Also Read
Air India: ఇజ్రాయిల్-ఇరాన్ టెన్షన్.. టెల్ అవీవ్‌కి విమానాలు నిలిపేసిన ఎయిర్ ఇండియా..
మరి ఎందుకు CBI కి ఇవ్వడం లేదు అని, రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అని ఆయన అన్నారు. డిసెంబర్ 23న ధరణి పై కమిటీ వేశారు… అది ఎప్పటి వరకు పూర్తి అవుతుందని, సీఎం గా రెండవ రోజే రేవంత్ ధరణి పై రివ్యూ చేస్తే.. న్యాయం జరుగుతుందని రైతులు అభిప్రాయ పడ్డారన్నారు. ఈ పోర్టల్ ను గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగిస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? అని ఆయన వ్యాఖ్యానించారు. ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు తగ్గాయని అంటున్నారని, బీఆర్ఎస్ భూభకాసురులు కాజేశారా? ధరణి పోర్టల్ నిర్వహణను NIC కి ఇచ్చే ఆలోచన ఉందా ? ధరణి పోర్టల్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తారా ? జరిపిస్తే ఎప్పటిలోగా జరిపిస్తారు? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.
Toofan: చివరి నిముషంలో వెనక్కి తగ్గిన విజయ్ ఆంటోనీ.. రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!