అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు నరేష్. అల్లరి సినిమా పేరే తన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది..నరేష్ తన కెరియర్ మొదటి నుంచి కూడా అన్ని కామెడీ సినిమాలు చేసేవాడు…కానీ కొన్నాళ్ళు గా ఆ సినిమాలు సరిగ్గా హిట్ అవ్వకపోవడం తో ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ సినిమాలని నరేష్ ట్రై చేస్తున్నాడు అందులో భాగం గా వచ్చిన సినిమాలే అల్లరి నరేష్ ఇటీవల చేసిన నాంది మరియు ఉగ్రం వంటి రెండు థ్రిల్లర్ మూవీస్…ఈ సినిమాల తో తన అభిమానులను మెప్పించాడు.
విజయ్ కనకమేడల తీసిన ఆ రెండు సినిమాల్లో కూడా భారీ ఎమోషనల్ క్యారెక్టర్స్ తో తన లోని పెర్ఫార్మన్స్ తో అదరగొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నరేష్. ఇక ఆయన తరువాత సినిమా పై ఇప్పటికే టాలీవుడ్ లో ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది. అల్లరి నరేష్ తన తరువాత మూవీని పీరియాడిక్ జానర్ లో చేయనున్నారని సమాచారం.. తొలిసారిగా అల్లరి నరేష్ ఇటువంటి జానర్ మూవీ చేస్తుండగా దీనిని అద్భుతం గా తెరకెక్కించేందుకు ప్రస్తుతం యువ దర్శకుడు అయిన సుబ్బు కథ మరియు కథనాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి పూర్తి వివరాలు అధికారికం గా వెల్లడి కానున్నట్లు సమాచారం..ఈ వార్త నిజం అయితే అల్లరి నరేష్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు..అయితే అల్లరి నరేష్ ఒకప్పుడు అన్నీ కామెడీ సినిమాలు చేశాడు ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలని చేస్తూ మెప్పిస్తున్నాడు..కానీ వరుసగా అవే సినిమాలు చేయడం వల్ల ఆయన కెరీర్ చాలా పెద్ద మైనస్ అయ్యే అవకాశం కూడా ఉందని కామెడీ సినిమాలు ఎలా అయితే ఆయన కి మైనస్ అయిందో ఇలాంటి థ్రిల్లర్ జానర్ లో మరో సినిమా కనుక చేస్తే ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. అందుకే నరేష్ సరికొత్తగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.