Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alla Nani No More: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం నెలకొంది.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు.. ఆయన పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్.. అంతా ఆయన్ని ఆళ్ల నానిగానే పిలుస్తారు.. వయస్సు 57 ఏళ్లు.. 1969 డిసెంబర్ 30 ఏలూరులో జన్మించారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే, ఈ రోజు విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుతో ఆళ్ల నాని కన్నుమూశారు.. ఆళ్ల నాని 2004లో మొదటి సారిగా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు.. ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు ఏలూరు నుంచే ఎమ్మెల్యేగా సేవలందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డిప్యూటీ సీఎంగా.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు ఆళ్ల నాని.. అయితే, 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఆళ్ల నాని..
విశాఖపట్నంలో ఉన్న సమయంలో ఆళ్ల నాని గుండెపోటుకు గురైనట్లు సమాచారం. కార్డియాక్ అరెస్ట్‌తో ఉదయం అస్వస్థతకు గురైన ఆయన.. డ్రైవర్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్తుండగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. అనంతరం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం.. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా..
ఆళ్ల నాని తొలిసారిగా 2004లో ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లోనూ ఏలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అనంతరం 2017లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడిగా ఆయన నిలిచారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఆళ్ల నానికి కీలక బాధ్యతలు దక్కాయి. 2019 నుంచి 2021 వరకు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అదే సమయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
2022లో మంత్రి పదవి నుంచి తప్పుకున్న నాని
2022 ఏప్రిల్‌లో వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు. అనంతరం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.
వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిక
2024 ఆగస్టు 9న ఆళ్ల నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. అయితే అనంతరం ఆయన రాజకీయ ప్రయాణం మరో మలుపు తిరిగింది. 2025 ఫిబ్రవరి 13న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగింది.
ఏలూరుకు భౌతికకాయం తరలింపు
ఆళ్ల నాని మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. ఆయన భౌతికకాయాన్ని విశాఖపట్నం నుంచి ఏలూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరులో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆళ్ల నాని మృతి ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?