ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్‌బైక్ తయారీ సంస్థ అయిన డుకాటీ, భారతీయ మార్కెట్లో సరికొత్త డుకాటీ పానిగేల్ V4 R ను విడుదల చేసింది. ఇది మోటోజీపీ మరియు వరల్డ్ సూపర్‌బైక్ చాంపియన్‌షిప్ నుంచి నేరుగా వచ్చిన టెక్నాలజీతో తయారైంది. ఇందులో కార్నర్ సైడ్‌పాడ్‌లు, డుకాటీ రేసింగ్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి. దీనిలో న్యూట్రల్ గేర్ మొదటి గేర్ క్రింద ఉంటుంది. భారతదేశంలో 2025 మోడల్‌లో మొట్టమొదటి, ఏకైక పానిగేల్ V4 R ను డుకాటీ చెన్నై జనవరి 1, 2026న డెలివరీ చేసింది. దీని బుకింగ్ ఇప్పుడు ప్రారంభమైంది.
Also Read:Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!.. ఈ నంబర్‌కి సమాచారం ఇవ్వండి..
ఈ సూపర్‌బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84.99 లక్షలు. ఇది ఐకానిక్ డుకాటి రెడ్ లివరీ కలర్ ఆప్షన్‌లో వస్తోంది. ఈ బైక్ డుకాటి రేసింగ్ టెక్నాలజీకి ఉత్తమ ఉదాహరణ, వరల్డ్ సూపర్‌బైక్ రేసులో ఉపయోగించే బైక్‌లకు దగ్గరగా ఉంటుంది. సరికొత్త డుకాటి పానిగేల్ V4 R అనేది కంపెనీ స్పోర్ట్స్ బైక్ లైనప్‌లో అత్యంత ప్రత్యేకమైన, అధిక-పనితీరు గల మోడల్. వేగం, పర్ఫామెన్స్ కోసం చూసే వారికి ఈ బైక్ బెస్ట్.
Also Read:Bhartha Mahasayulaku Wignyapthi: వామ్మో వాయ్యో.. ఇద్దరు హాట్ భామలతో రవితేజ రొమాన్స్!
ఇది 8:3 నిష్పత్తితో 6.9-అంగుళాల పూర్తి TFT డాష్‌బోర్డ్, DRL, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో పూర్తి LED హెడ్‌లైట్‌లు, బహుళ రైడింగ్ మోడ్‌లు (రేస్ A, రేస్ B, స్పోర్ట్, రోడ్, వెట్), ఫోర్జ్డ్ స్టీల్ క్రాంక్ షాఫ్ట్, మరింత సమర్థవంతమైన ఫ్రంట్ డైనమిక్ ఎయిర్ ఇన్‌టేక్, DLC కోటింగ్‌తో కాస్ట్ అల్యూమినియం పిస్టన్‌లు, డుకాటి న్యూట్రల్ లాక్, టైటానియం ఇన్‌టేక్ వాల్వ్, ఓవల్ థ్రోటిల్ బాడీలు, 17-లీటర్ అల్యూమినియం ఇంధన ట్యాంక్, ఫోర్జ్డ్ అల్యూమినియం వీల్స్, లిథియం బ్యాటరీ, బ్రెంబో హైప్యూర్ మోనోబ్లాక్ కాలిపర్లు, పిరెల్లి డయాబ్లో సూపర్‌కోర్సా V4 టైర్లు, పెద్ద బైప్లేన్ రెక్కలు, కార్నరింగ్ ABS, రేస్ బ్రేక్ కంట్రోల్, డుకాటి ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి స్లయిడ్ కంట్రోల్, డుకాటి వీలీ కంట్రోల్, డుకాటి పవర్ లాంచ్, డుకాటి క్విక్ షిఫ్ట్ మరియు ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైక్ డిజైన్ ఫ్రేమ్‌లెస్, అగ్రెసివ్ ఏరోతో మోడర్న్ రేసర్ లుక్ ఇస్తుంది.