Hotel Style Sherwa Recipe: హోటల్లో తిన్నప్పుడు వచ్చే ఆ స్పెషల్ టేస్ట్ ఇంట్లో కూడా రావాలని చాలా మంది అనుకుంటారు. వారి కోసమే ఈ రెసిపీ. బిర్యానీకి గ్రేవీలా అయినా, పరాటా, చపాతీ, పుల్కా, నాన్కు సైడ్ డిష్‌గా అయినా అన్నింటికీ సూటయ్యే ఆల్ ఇన్ వన్ ‘షేర్వా’ ఇప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి గ్రేవీని స్టెప్ బై స్టెప్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..
హోటల్ ఫ్లేవర్ రహస్యం – స్పెషల్ మసాలా పొడి:
ఈ షేర్వాకు అసలైన టేస్ట్ రావాలంటే ముందుగా మసాలా పొడిని తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక ఇంచ్ దాల్చిన చెక్క, మూడు యాలకలు, నాలుగు లవంగాలు, ఒక నల్ల యాలుక, రెండు టీస్పూన్లు ధనియాలు, ఒక టీస్పూన్ సోంపు వేసి మెత్తగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి.
Phone Tapping Case : ముగిసిన హరీష్‌రావు సిట్ విచారణ.. కాసేపట్లో మీడియా సమావేశం
గ్రేవీకి బేస్ – ఆనియన్ టమాటా పేస్ట్:
స్టవ్‌పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు, టమాటాలు, చిన్న ముక్క చింతపండు వేసి నూనెలో మగ్గించాలి. తర్వాత గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
షేర్వా తయారీ:
మళ్లీ కడాయిలో సరిపడా ఆయిల్ వేడి చేసి జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఇందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఆకులు వేసి మంచి అరొమా వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి, ముందుగా తయారు చేసుకున్న ఆనియన్–టమాటా పేస్ట్‌ను వేసి లో ఫ్లేమ్‌లో బాగా ఉడికించాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్పెషల్ మసాలా పొడిని వేసి మూత పెట్టి కొన్ని నిమిషాలు కుక్ చేయాలి.
Vijay Deverakonda-VD14: విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. ‘ది రైజ్ బిగిన్స్’!
సరైన కన్సిస్టెన్సీ:
పరాటా, చపాతీ, పుల్కాలకు కొంచెం మందంగా ఉండేలా తక్కువ నీళ్లు వేసుకోవచ్చు. బిర్యానీకి గ్రేవీగా వాడాలంటే కొంచెం పలుచగా ఉండేలా ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకోవాలి. చివరగా ఉప్పు సర్దుబాటు చేసి ఐదు నిమిషాలు కుక్ చేయాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలిపితే.. హోటల్ స్టైల్ ఆల్ ఇన్ వన్ షేర్వా రెడీ. ఈ షేర్వాను ఫ్రిడ్జ్‌లో మూడు నుంచి నాలుగు రోజులు వరకు స్టోర్ చేసుకోవచ్చు. బిర్యానీ చేసినప్పుడు లేదా రోటీస్, పరాటాలతో సైడ్ డిష్‌గా సర్వ్ చేస్తే.. ఇంట్లో వాళ్లందరికీ ఇది ఆల్ టైం ఫేవరెట్ అవడం పక్కా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి చూసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ను తప్పకుండా షేర్ చేయండి.