NTV Telugu Site icon

Alia Bhatt: కూతురు ఫొటోలు తొలగించడంపై ఆలియా భట్ క్లారిటీ..

Alia Bhatt

Alia Bhatt

బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కూతురు రియా చిత్రాలను ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. ఆలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా వెళ్లిన జామ్‌నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. తాజాగా ఈ అంశంపై ఆలియా క్లారిటీ ఇచ్చింది. మీడియాతో మాట్లాడిన ఆమె తన కుమార్తె సంరక్షణ నిమిత్తం ఫొటోలను తొగించినట్లు తెలిపింది.

READ MORE: Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా

తనకు ఓ పీడ కల వచ్చినట్లు ఆలియా భట్ తెలిపింది. “ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడి.. తన కుమార్తె రాహాను ఎత్తుకెళ్లినట్లు కల వచ్చింది. ఇది చాలా దారుణం. ఈ ఘటనతో పాప సంరక్షణ కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణియించుకున్నాను. తన వివరాలు, ఫొటోలు సోషల్ మీడియాలో ఉంచవద్దని అనుకున్నా.. మా అభ్యర్థనను మన్నించండి.. అర్థం చేసుకోండి. మా అనుమతి లేకుండా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఎప్పుడైనా మాతో పాటు పాప ఫొటో కూడా ఉంటే ముఖం కనపడకుండా బ్లర్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. సమయం వచ్చినప్పుడు ఆమెను నేనే మీ ముందుకు తీసుకొస్తాను. పాప పుట్టుకతో నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తుంది. నేను ఎంతో మారాను.’’ అని ఆలియా పేర్కొంది.

READ MORE: Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత సంభాల్‌లో హోలీ వేడుకలు.. భారీగా భద్రత..