Ali Khamenei: ఖమేనీ అంతం.. ఆ 5 కారణాలే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణం తీశాయా?
Ali Khamenei: మధ్యప్రాచ్యంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన అలీ ఖమేనీ శకం ముగిసింది. అయితే, ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్‌లో ఖమేనీ సులభంగా చిక్కడానికి ఆయన చేసిన ఐదు ప్రధాన తప్పులే కారణమని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
* అలీ షంఖానీపై మితిమీరిన నమ్మకం:
ఖమేనీ తన భద్రతా సలహాదారు అలీ షంఖానీని గుడ్డిగా నమ్మడం ఆయన చేసిన మొదటి తప్పు అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. జూన్ 2025లో షంఖానీపై దాడి జరిగినప్పుడే శత్రువుల నిఘా ఆయనపై ఉందని అర్థమైంది. అయినప్పటికీ, షంఖానీ, IRGC చీఫ్ పక్‌పూర్‌లతో ఖమేనీ నేరుగా సమావేశమవ్వడం శత్రువులకు ‘గోల్డెన్ ఛాన్స్’ ఇచ్చింది. షంఖానీ ప్రతి కదలికను ట్రాక్ చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్ శక్తులు, ఆయన ద్వారానే ఖమేనీ ఉన్న లొకేషన్‌ను పక్కాగా గుర్తించగలిగాయని చెబుతున్నారు.
* సురక్షిత బంకర్‌లోకి వెళ్లకపోవడం:
యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అత్యున్నత స్థాయి నాయకులు భూగర్భ బంకర్లలో ఉండటం కనీస భద్రతా నియమం. కానీ, ఖమేనీ తన వ్యక్తిగత భద్రతపై అతివిశ్వాసం ప్రదర్శించారు. నిరంతర డ్రోన్ దాడులు జరుగుతున్నా, ఆయన సురక్షిత ప్రాంతానికి మారకుండా బహిరంగ ప్రదేశంలోనే సమావేశాలు నిర్వహించడం శత్రువులకు పని సులువు చేసింది.
* అమెరికా చర్చలను ‘నిజం’ అని నమ్మడం
అమెరికాతో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు తనను కాపాడతాయని ఖమేనీ భావించారు. చర్చలు జరుగుతున్నంత కాలం తనపై నేరుగా దాడి జరగదని ఆయన వేసిన అంచనా తప్పింది. అమెరికా ఒకవైపు చర్చల నాటకం ఆడుతూనే, మరోవైపు ఖమేనీని అంతం చేసేందుకు వ్యూహాత్మక సమయం కోసం వేచి చూసింది. దౌత్య ప్రక్రియను నమ్మి అప్రమత్తత వదిలేయడం ఆయన చేసిన మూడో తప్పు.
* అణుబాంబుపై ‘ఫత్వా’ – బలహీనతగా మారింది
1990లలో అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా ఖమేనీ జారీ చేసిన ‘ఫత్వా’ ఇరాన్‌ను రక్షణ పరంగా వెనక్కి నెట్టింది. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయదని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. ఇది శాంతి మంత్రంలా కనిపించినా, శత్రు దేశాలు దీనిని ఇరాన్ బలహీనతగా భావించాయి. అణ్వాయుధాలు లేకపోవడం వల్లనే ఇరాన్ నాయకత్వంపై నేరుగా దాడి చేసేందుకు అమెరికా సాహసించగలిగింది.
* మారుతున్న పరిస్థితుల్లో భద్రతా వైఫల్యం
మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతున్నా, అమెరికా-ఇజ్రాయెల్ విధానాలు కఠినతరం అవుతున్నా ఖమేనీ తన పాత భద్రతా పద్ధతులనే అనుసరించారు. మారుతున్న టెక్నాలజీ (డ్రోన్లు, శాటిలైట్ ట్రాకింగ్), శత్రువుల దూకుడును ఆయన తప్పుగా అంచనా వేశారు. ఈ వ్యూహాత్మక నిర్లక్ష్యమే ఆయన 36 ఏళ్ల సుదీర్ఘ పాలనకు విషాద ముగింపు పలికింది.
ఖమేనీ చేసిన ఈ 5 తప్పులు ఇరాన్ చరిత్రను మలుపు తిప్పాయి. ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నడిపిన నాయకుడు, చిన్నచిన్న భద్రతా లోపాలు, అతివిశ్వాసం కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్‌లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!