Albania: మీరు చదివింది నిజమే. అల్బేనియాలో డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మంత్రి. మీకు తెలుసు కదా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తోన్న సంచలనాలు అన్ని ఇన్ని కావని. ఇప్పటికే ప్రతీ రంగంలో ఏఐ తనదైనా ముద్ర వేస్తూ వినియోగదారుల మదిలో చెరగని గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ఐరోపా దేశమైన అల్బేనియా ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఏఐ మంత్రిని తీసుకొచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అధునాతన సాంకేతికతను ఉపయోగించి దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేయడానికి ఏఐ ఆధారిత అసిస్టెంట్ ‘డియెల్లా’ను క్యాబినెట్ మంత్రిగా నియమించినట్లు ఆ దేశ ప్రధాని ఏడీ రహ్మా ప్రకటించారు. మీకు తెలుసా.. ప్రపంచంలోనే ఈతరహా నియామకం జరగడం ఇదే తొలిసారి.
READ ALSO: Arjun Tendulkar: ఎంగేజ్‌మెంట్ అనంతరం మొదటి మ్యాచ్.. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన అర్జున్!
సంప్రదాయ దుస్తుల్లో ఏఐ మంత్రి..
అల్బేనియాలో డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఆధునిక సాంకేతికత, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ఆ ఏఐ చాట్‌బాట్‌ను తీర్చిదిద్దారు. ఈ వర్చువల్ మహిళా మంత్రి ఆ దేశ సంప్రదాయ దుస్తులు ధరించినట్టుగా రూపొందించారు. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విభాగాన్ని పర్యవేక్షించేందుకు ఈమెను నియమించినట్లు తెలిపారు. ఈ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని అక్కడి ప్రభుత్వంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈసందర్భంగా ఆ దేశ ప్రధాని మాట్లాడుతూ.. పాలనా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా, ప్రభుత్వ సేవలను జనాలకు మరింత చేరువ చేసేలా దశలవారీగా ఈతరహా సంస్కరణలు తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ ఏఐ వ్యవస్థ ద్వారా అవినీతిపై జరిపే పోరాటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. ఈ డియెల్లా.. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుంది. ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షించనుంది. పక్షపాతం ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా టెండర్లను మూల్యాంకనం చేయనుంది. పారదర్శకతతో పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరిగేలా చూడనుందని వెల్లడించారు.
అల్బేనియాలో పబ్లిక్ టెండర్లు అవినీతి కుంభకోణాలకు కేంద్రంగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. మాదకద్రవ్యాలు, ఆయుధ అక్రమ రవాణా నుంచి లాభాలను అక్రమంగా మార్చే అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లకు దేశం కేంద్రంగా మారిందని పలువురు హైలైట్ చేస్తున్నారు. ఈ అవినీతి ప్రభుత్వ సీనియర్ స్థాయి వ్యక్తులకు చేరుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రధాని ఏడీ రహ్మా దేశంలో అవినీతిని అంతం చేయడానికి కొత్త ప్రయత్నంగా ఏఐ మంత్రిని తీసుకొచ్చారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. డీయెల్లా ఇప్పటివరకు 36,600 డిజిటల్ పత్రాల జారీని సులభతరం చేసింది. ప్లాట్‌ఫామ్ ద్వారా దాదాపు 1,000 సేవలను అందించినట్లు నివేదికలు వెలువడ్డాయి. ప్రభుత్వ రంగంలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవడంతో, యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి అల్బేనియా ప్రయత్నాలకు కీలకమైన ప్రమాణంగా మారనున్నట్లు సమాచారం.
READ ALSO: Chhattisgarh: వేరే వ్యక్తితో మాట్లాడుతోందని…అంత పని చేశాడా..