ఛత్తీస్‌గఢ్ లో దారుణం వెలుగుచూసింది. తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో.. ఆమె అత్యాచారం చేసి… స్కూడ్రైవర్ తో 51 సార్లు పొడిచి హత్య చేశాడు. రేండేళ్ల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికి.. తాజాగా కోర్టు కేసులో నిజాలు బయటకు వచ్చాయి. దీంతో కోర్టు అతడి జీవిత ఖైదు విధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె స్కూల్ చదివే రోజుల్లో స్కూల్ కు బస్సులో వెళుతుండగా.. ఆ బస్సు కండక్టర్ తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకునే వారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే తన ప్రియురాలు వేరే వ్యక్తితో అనుమానం పెంచుకున్న యువకుడు ఎవరూ లేని టైంలో యువతి ఇంట్లో ఎవరూ లేని టైంలో వెళ్లి ఆమెపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు.
అయితే ఒక రోజు ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లడంతో యువతి ఒక్కతే ఇంట్లో ఉన్నట్టు నిందితుడు తెలుసుకున్నాడు. ఇక ఇంట్లోకి దూరి యువతిపై అత్యాచారం చేసి ఆ తర్వాత స్కూల్‌డ్రైవర్‌తో ఆమెను అతికిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడే ఇంటికి వచ్చిన బాధితురాలి సోదరుడు ఇంట్లో తన సోదరి స్పృహతప్పి పడిపోయి ఉండడం చూసి వెంటనే తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు, పోలీసులు మంచంపై పడిఉన్న యవతిని పరిశీలించారు. ఆమె ముఖం, మెడ, చేతులు, ఛాతీపై చాలా చోట్ల గాయాలు కనిపించాయి. పక్కనే కొత్త స్క్రూ డ్రైవర్స్, బెడ్‌పై నిందితుడి పేరుతో ఉన్న ప్లైట్ టికెట్స్‌దొరికాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు పోలీసులు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ..నిర్ధారణ కావడంతో రెండేళ్ల తర్వాత నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది.