బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర లో నటించిన ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) మంచి విజయం సాధించింది. 2012 లో వచ్చిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ సినిమా రూపొందింది.ఆగస్టు 11వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన ‘ఓఎంజీ 2’ ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన కలెక్షన్లను కూడా సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఓఎంజీ 2 ఓటీటీ గురించి నెట్‍ఫ్లిక్స్ ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది. అయితే, ముందు వెల్లడించిన తేదీ కంటే ఒకరోజు ముందుగానే ఈ చిత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చింది..ఓఎంజీ 2 చిత్రాన్ని అక్టోబర్ 8వ తేదీన స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ఇటీవల నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఒక రోజు ముందుగానే అంటే నేడే (అక్టోబర్ 7) ఓఎంజీ 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.
ప్రస్తుతం హిందీ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.ఓఎంజీ 2 సినిమా కు అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ను ఓ సున్నితమైన అంశం ఆధారంగా తెరకెక్కించారు.ఈ కథాంశాన్ని ఎంటర్‌టైనింగ్, హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించిన అమిత్‍పై ప్రశంసలు వచ్చాయి. ఓఎంజీ 2 చిత్రం లో పిల్లాడి తండ్రి గా పంకజ్ త్రిపాఠి మరియు దేవుడి దూతగా అక్షయ్ కుమార్ నటించారు. యామి గౌతమ్, పవన్ మల్హోత్రా, గోవింద్ నామ్‍దేవ్, అరుణ్ గోవిల్, బ్రిజేంద్ర కాలా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కు విక్రమ్ మత్సోర్, రఘువంశీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వియాకామ్ 18 మరియు వకావు ఫిల్మ్స్ సంయుక్తం గా ఓఎంజీ 2 సినిమాను నిర్మించాయి.ఈ సినిమా తో ఖిలాడి హీరో అక్షయ్ కుమార్ మంచి విజయం అందుకున్నారు.