అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. నాలుగు, ఐదు సినిమాలు చేశాడు.. కానీ ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు.. గత ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది.. ఆ తర్వాత అఖిల్ బయట పెద్దగా కనిపించలేదు.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అక్కినేని అభిమానులనే ఆకట్టుకోలేకపోయింది. అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు పడిన కష్టం అంతా వృథా అయిపోయిందని డైరెక్టర్ ను ఫ్యాన్స్ తిట్టిపోశారు..
ఆ సినిమా వల్లే తర్వాత సినిమాను ఇప్పటివరకు అనౌన్స్ చెయ్యలేదు.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. అయితే తాజాగా ఎయిర్ పోర్ట్ లో అఖిల్ కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.. ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి అఖిల్ ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే.. ఏప్రిల్ 8న తన పుట్టిన రోజు వేడుకలను ఫారెన్‌లో చేసుకొని తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో అఖిల్ కొత్త లుక్‌లో కనిపించాడు..
ఆ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. తన కొత్త సినిమా లుక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చెయ్యబోతున్నాడు.. UV క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.. గతంలో మొదలు పెట్టాలని అనుకున్న కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.. ఇప్పుడు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా పై అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా అఖిల్ కు భారీ హిట్ ను అందిస్తుందేమో చూడాలి..