Site icon NTV Telugu

Akhilesh Yadav: కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఈడీ ఏర్పాటు.. ఇప్పుడు దాని వలలోనే హస్తం పార్టీ!

Akhilesh Yadav

Akhilesh Yadav

గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా యూపీ ఎంపీ, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు అయ్యిందని, ఇప్పుడు అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ ఈడీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జిషీటు దాఖలును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

READ MORE: Caste Discrimination : విద్యార్థుల మధ్య కుల వివక్ష.. మంచి బుద్ధి చెప్పాల్సిన ఉపాధ్యాయుడే..!

ఒడిశాలో పర్యటనలో ఉన్న అఖిలేష్‌ యాదవ్ ఈ అంశంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. బీజేపీ నేతృత్వంలో డబుల్‌ ఇంజిన్‌ మోడల్‌ ఏ మేరకు విజయం సాధించిందని అడిగిన ప్రశ్నకు అఖిలేష్ బదులిచ్చారు. యూపీలో రెండు ఇంజిన్లు వేర్వేరు లైన్లలో వెళ్తున్నాయని విమర్శించారు. ఒడిశాలో ఏం జరుగుతోందనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఫలితాలు లేవన్నారు.

READ MORE: Sarangapani Jathakam : సారంగపాణి జాతకం ట్రైలర్.. ఆద్యంతం నవ్వులు పూయిస్తోందిగా..

మరోవైపు ఈడీ విచారణపై రాబర్ట్ వాద్రా స్పందించారు. ‘‘నిత్యం ప్రజల కోసం పోరాడే గాంధీ కుటుంబంలో నేను భాగం. దాంతో సహజంగానే నన్ను, మా కుటుంబాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుంది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై వారు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మీరు ఎంతగా ఇబ్బంది పెడితే.. మేం అంతగా బలపడతాం. మాకు ఎదురయ్యే ప్రతిసవాలును దాటుకొని ముందుకు వెళతాం. కానీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే వారిపై ఒత్తిడి తెచ్చేందుకు వాటిని దుర్వినియోగం చేస్తుండటంతో ఇక ప్రజలు ఆ సంస్థలను విశ్వసించరని నా అభిప్రాయం. ’’ అని వాద్రా మీడియాతో వెల్లడించారు.

Exit mobile version