అక్కినేని యువ హీరో అఖిల్ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం ‘లెనిన్’ (LENIN). ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మేడే కానుకగా మే 1, 2026న ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
Also Read : Sambarala Etigattu : సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మాస్ అప్డేట్!
ఈ సినిమాలో అక్కినేని అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించే విషయం ఏమిటంటే.. అఖిల్ తండ్రిగా కింగ్ నాగార్జున నటించబోతున్నారనే వార్త. ఇప్పటికే నాగచైతన్యతో కలిసి ‘బంగార్రాజు’లో సందడి చేసిన నాగ్, ఇప్పుడు అఖిల్ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ పవర్ఫుల్ పాత్రకు నాగార్జున అయితేనే న్యాయం జరుగుతుందని భావించిన మేకర్స్ ఆయనను ఒప్పించారట. అఖిల్ సరసన క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి పండుగ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు ‘వారెవా వారెవా’ సాంగ్ తో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో అఖిల్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వేసవిలో తండ్రీకొడుకుల మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Wishing you all a very Happy Sankranthi from our #LENIN family to yours 😊❤️
Sing along groove to the ever irresistible #VaarevaaVaarevaa and keep the celebrations going ❤️🔥https://t.co/WPWN6Uo71E#LENIN 𝐢𝐧 𝐜𝐢𝐧𝐞𝐦𝐚𝐬 𝐰𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐨𝐧 𝐌𝐚𝐲 𝟏𝐬𝐭, 𝟐𝟎𝟐𝟔 🔥… pic.twitter.com/rsILD66UVI
— Annapurna Studios (@AnnapurnaStdios) January 15, 2026