అక్కినేని యువ హీరో అఖిల్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం ‘లెనిన్’ (LENIN). ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మేడే కానుకగా మే 1, 2026న ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లుగా…