మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2 తాండవం’. బోయపాటి దక్శకత్వంలో హీరోయిన్ సంయుక్త మీనన్‌ను నటించిన ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ అఖండ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వారికి మరింత ఉత్సాహం పెంచే ఓ క్రేజీ లీక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ లీక్ ఏకంగా ‘అఖండ 3’ టైటిల్ గురించే కావడం విశేషం.
Also Read : Dil Raju : దిల్ రాజు ప్రొడక్షన్స్ కీలక ప్రకటన..
గతంలో, ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపిన ‘పుష్ప 2’ ఫైనల్ వర్క్స్ జరుగుతున్నప్పుడు, మూడో పార్ట్‌కు సంబంధించిన టైటిల్ ‘పుష్ప ది ర్యాంపేజ్’ అంటూ మేకర్స్ స్టూడియో నుంచి బయటకు లీకైంది. థియేటర్లలో కూడా పార్ట్ 3 టైటిల్‌ను ఇదే విధంగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు, అదే తరహా ఫార్మాట్‌లో ‘అఖండ 3’ టైటిల్ కూడా లీకైందని చెప్పాలి. కాగా ‘అఖండ 2 తాండవం’ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న ఎస్.ఎస్. థమన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పిక్‌ను షేర్ చేశారు. ఆ పిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్పష్టంగా “జై అఖండ” అనే టైటిల్ కనిపిస్తోంది. దీంతో, ‘అఖండ 3’ టైటిల్ ఇదే అంటూ వైరల్ అవుతుంది. మరి ఈ లీక్ నిజమో కాదో, ఈ టైటిల్ అఖండ 3కేనా కాదా అనే విషయం థియేటర్ లో తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్‌కు ఇది నిజంగా డబుల్ ట్రీటే!
AUM NAMA SHIVAYA 🔱🔥 !!
JAI AKHANDA 📈
THE ROAR IS
BIGGER MIGHTIER STRONGER
ALL SET FOR A TRANCE OF SHIVA 🔱🙌🏿💪🏾Get ready 🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🙏#Akhanda2Thaandavam 🔥🔫💣🔱 pic.twitter.com/lle8JGXlYP
— thaman S (@MusicThaman) December 3, 2025