Site icon NTV Telugu

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది!

Akhanda 2

Akhanda 2

Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో ‘అఖండ 2’ విడుదల తేదీపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.

READ MORE: Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని వార్నింగ్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై ఓ క్లారిటీ వచ్చింది! నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. అఖండ2 ని పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము.. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు, అత్యంత ఊహించని విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. అఖండ 2 ఎప్పడు వచ్చినా గురి చూసి కొడుతుంది.. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం..” అంటూ 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది. మరోవైపు.. బుక్‌ మై షో సైతం సినిమా రిలీజ్‌పై స్పందించింది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు యాప్‌లో అప్‌డేట్‌ చేసింది. నిర్మాణ సంస్థ సైతం క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి.. తాజాగా విడుదలైన ఈ రెండు స్టేమెంట్స్ చూస్తుంటే ఈ సినిమా వచ్చే ఏడాది(2026)న విడుదల కానున్నట్లు తెలుస్తోంది! కొంత మంది అభిమానులు మాత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Mali: షాకింగ్.. తెలంగాణ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు..

Exit mobile version