బాలయ్య – బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 అనేక వాయిదాల అనంతరం థియేటర్స్ లో అడుగు పెట్టింది. ఎప్పుడెప్పుడు అఖండ 2 చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూసిన అభిమానుల వెయిటింగ్ కు తెరదించి థియేటర్స్ వద్ద మాస్ తాండవం ఆడించేందుకు గత రాత్రి 9 గంటల ఆటతో వచ్చేశాడు అఖండ. భారీ అంచనాలు, భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
బాలయ్య – బోయపాటి కాంబో నుండి ఆడియెన్స్ ఏమి కోరుకుంటారో వాటిని పుష్కలంగా అందించాడు బోయ.లాజిక్స్, మ్యాజిక్స్ అన్ని పక్కన పెట్టి శివతాండవాన్ని థియేటర్ లో తప్పకుండా చూడాల్సిందే. ఈ రోజు నుండి రెగ్యులర్ షోస్ స్టార్ట్ కానున్నాయి. ఈ రోజు కూడా అడ్వాన్స్ ఫుల్స్ బుకింగ్స్ తో ట్రేండింగ్ అవుతోంది. ఇక ప్రీమియర్స్ తో పాటు ఈ మొదటి రోజ కలెక్షన్స్ భారీ నెంబర్ ఉండబోతున్నాయి. ట్రెండ్ అంచనా ప్రకారం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 70 నుండి రూ. 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా బాలయ్య – బోయపాటి కాంబోకు ఉన్న క్రేజ్ దానికి తగ్గట్టు హిట్ టాక్ రావడం ఈ సినిమా లాంగ్ రన్ కు కలిసొచ్చిన అంశం. ఈ కాంబోలో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఐదవ సినిమాగా వచ్చిన అఖండ 2 కూడా మరోసారి బోయ – బాలయ్య స్టామినా ఏంటో చూపించింది.