Akash Deep Hits Maiden Test Fifty , Viral Video: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ ఆకాశ్ దీప్ హాఫ్ సెంచరీ చేశాడు. అట్కిన్సన్ వేసిన 38 ఓవర్‌లోని మూడో బంతికి బౌండరీ బాది.. అర్ధ శతకం పూర్తి చేశాడు. 70 బంతుల్లో అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. ఆకాశ్ దీప్‌కు టెస్టుల్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ అనంతరం ఆకాష్ అవుట్ అయ్యాడు. 94 బంతుల్లో 12 ఫోర్లతో 66 రన్స్ చేశాడు.
మూడోరోజు ఆటలో ఆరంభం నుంచే ఆకాశ్ దీప్ ధనాధన్ షాట్లు ఆడాడు. యశస్వి జైస్వాల్ కాస్త ఆచితూచి ఆడుతుంటే.. ఆకాశ్ మాత్రం దంచుడే లక్ష్యంగా ఆడాడు. ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అద్భుత ఆటతో 70 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఫోర్ బాది మరీ 50 మార్కును చేరుకోవడం విశేషం. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆకాశ్ దీప్‌పై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఆకాశ్ దీప్ సూపరో సూపర్’., ‘ఆకాశ్ దీప్ బెస్ట్ ఇన్నింగ్స్’, ‘ఔరా.. ఆకాశ్ దీప్’ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం బౌండరీలు బాదిన ఆకాష్.. జేమీ ఒవర్టన్ వేసిన 43 ఓవర్‌లోని తొలి బంతికి అట్కిన్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు విడుదల.. మళ్లీ ఆడేది ఎప్పుడో!
యశస్వి జైస్వాల్‌తో కలిసి ఆకాశ్ దీప్ 150 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇందులో 66 రన్స్ అతడివే ఉండడం విశేషం. నైట్‌వాచ్ మెన్‌గా వచ్చిన ఆకాశ్.. అద్భుత ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక 43 ఓవర్ల ముగిసేసరికి భారత్ మూడు వికెట్స్ కోల్పోయి 181 రన్స్ చేసింది. జైస్వాల్ 84, గిల్ 4 పరుగులతో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 160 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.
Fifty that felt like a hundred! 💯⁰Nightwatchman turned game-changer.⁰Akash Deep — take a bow 👏
~ What’s your take on this 🤔 #INDvsENG #ENGvIND— Kavya Maran (@Kavya_Maran_SRH) August 2, 2025