NTV Telugu Site icon

Ajay Maken: కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 382 కోట్ల కుంభకోణానికి పాల్పడింది..

Ajay Maken

Ajay Maken

ఆమ్ ఆద్మీ పార్టీ రూ.382 కోట్ల కొత్త కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో ఓ నాయకుడు కాగ్ రిపోర్టు తెచ్చి కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవాడని, ఇప్పుడు అదే కాగ్ రిపోర్టులే వారి అవినీతిని చెబుతున్నాయన్నారు. 14 కాగ్ నివేదికలు వచ్చాయని అజయ్ మాకెన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.382 కోట్ల ఆరోగ్య కుంభకోణం జరిగినట్లు ఈ కాగ్ నివేదిక తెలియజేస్తోందన్నారు.

READ MORE: Noise ColorFit Pro 6: AI ఫీచర్లతో నాయిస్ న్యూ స్మార్ట్ వాచ్‌లు.. ధర ఎంతంటే?

బురారీలోని ఇందిరాగాంధీ హాస్పిటల్, మౌలానా ఆజాద్ డెంటల్ హాస్పిటల్ నిర్మాణంలో అవినీతి జరిగిందని అజయ్ మాకెన్ అన్నారు. ఈ మూడు ఆసుపత్రుల నిర్మాణ పనులు కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమయ్యాయని, అయితే కేజ్రీవాల్ ప్రభుత్వంలో దాని నిర్మాణం నిరంతరం జాప్యమైందని అజయ్ మాకెన్ అన్నారు. దీంతో టెండర్ డబ్బులు పెరుగుతూ వచ్చాయని తెలిపారు. వీటిలో ఇందిరాగాంధీ ఆస్పత్రి నిర్మాణానికి అత్యధికంగా రూ.314 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఈ అవినీతి ఎలా జరిగిందో కేజ్రీవాల్ ప్రభుత్వం చెప్పాలి? అని ప్రశ్నించారు.

READ MORE: Hyderabad: గాంధీభవన్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు..

“మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. దీంతో ఆయన ఉద్దేశం స్పష్టమైంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా దేశ వ్యతిరేకి. 2007-15 మధ్య 15 ప్లాట్లను ఢిల్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు కాగ్ నివేదిక చెబుతోంది. అయితే ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. 2016-17 నుంచి 2021-22 వరకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వచ్చిన డబ్బులో రూ.2,623 కోట్లు ఖర్చు చేయలేకపోయింది.” అని వ్యాఖ్యానించారు.