Farhana : డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై, ఎస్ఆర్ ప్రకాశ్, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఫర్హానా. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మే 12తేదీన ఫర్హానా సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆమె ఓ ముస్లిం అమ్మాయిగా కనిపించబోతున్నారు. ఐశ్వర్యా రాజేశ్ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
Read Also: Gold Price : తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర
ప్రమోషన్లలో భాగంగా.. ఐశ్వర్యను ఓ జర్నలిస్ట్ .. ‘ఈ మధ్య ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేయటానికి గల కారణాలేంటి? అనే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు ఐశ్వర్య దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు నాకు వేసిన ప్రశ్నను మీరు హీరోలనెందుకు అడగదు. మీరు హీరో ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారని.. నేను పర్టిక్యులర్ గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలనే చేయాలని అనుకోలేదు. ప్రస్తుతం కూడా చేయడం లేదు. హీరోలతో కలిసి నటిస్తున్నాను. ఆర్డర్ ప్రకారం ఫర్హానా ముందుగా వస్తుంది. నా మీద నమ్మకంతోనే నిర్మాతలను నాతో సినిమా నిర్మాతలు ఫర్హానా సినిమాను నాతో చేయటం చాలా లక్కీగా భావిస్తున్నాను. ఈ సినిమా నాకెంతో స్పెషల్ మూవీ. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ మూడు భాషల్లో రిలీజ్ కావటం అనేది చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. నా కెరీర్లో చాలా హెవీ రోల్ చేశాను. దాదాపు అన్నీ సీన్లు లైవ్ లోకేషన్లోనే తీశాం. ప్రేక్షకులు నా పాత్రను ఆదరిస్తారని నమ్ముతున్నాను’. అని ఐశ్వర్య తెలిపింది.
Read Also: TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత