డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉండలేకపోతున్నారు యూజర్లు. అందుకే టెలికాం కంపెనీలు తక్కువ ధరల్లోనే అపరిమిత 5G డేటా, ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాల్స్ వంటి బెనిఫిట్స్ ను అందిస్తు్న్నాయి. మరి మీరు కూడా ఇలాంటి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఎయిర్ టెల్ అందించే అధ్బుతమైన ఈ ప్లాన్ పై ఓ లుక్కేయండి. ఎయిర్‌టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌ను అందిస్తుంది. ఇది రోజుకు 2.5GB డేటా, అపరిమిత డేటా, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఇంకా, ఇందులో పెర్ప్లెక్సిటీ ప్రో AIకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 1199.
Also Read:Peddi: తిండి తిప్పలు మానేసిన బుచ్చిబాబు?
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ వినియోగదారులకు 2.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G కూడా చేర్చారు. డేటాతో పాటు, ఇతర ప్రయోజనాలలో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఉచిత SMS ఉన్నాయి. డేటా, కాలింగ్ ప్రయోజనాలతో పాటు, ఈ ప్యాక్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. అదనంగా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం కూడా ప్యాక్‌లో వస్తుంది. ఇది SonyLIVతో సహా 22 కి పైగా OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల పాటు ఉచిత హలో ట్యూన్ కూడా అందిస్తుంది.