Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీతో పాటు భాగ్యనగరం హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తోంది. దీపావళి పండుగ వేళ కాల్చిన టపాసులు, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా రెండు ప్రధాన నగరాల్లోనూ గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. ఢిల్లీలో ఆదివారం నాడు సగటు గాలి నాణ్యత సూచీ 376 వద్ద నమోదై అత్యంత భారీ డేంజర్ అలర్ట్ కు చేరింది. సోమవారం నాటికి ఇది మరింత పెరిగి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జహంగీర్‌పురి ప్రాంతంలో ఏకంగా 463 వరకు గాలి నాణ్యత సూచీ నమోదైంది. నగరంలోని మొత్తం కేంద్రాలలో పరిశీలిస్తే.. చాలా చోట్ల గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దాటింది. వాహనాల నుంచి వస్తున్న కాలుష్యం గణనీయంగా ప్రభావం చూపగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న పంట వ్యర్థాల దహనం కూడా కాలుష్యాన్ని పెంచుతోంది.
మరోవైపు హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీపావళి వేళ నగరంలో కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో లైవ్ గాలి నాణ్యత సూచీ ఏకంగా 321కి చేరుకుని అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. గాలిలో ప్రాణాంతకమైన ధూళి కణాలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యాయి. పండుగ ఆనందంలో చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన గాలి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
Also Read
- Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
- ECB: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
- Penugonda Farmers: తుఫాన్ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!
- Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
నిబంధనల ప్రకారం కాలుష్య స్థాయిలు ఈ విధంగా పెరిగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. పండగ పూట వెలువడిన భారీ పొగ వల్ల ఇరు నగరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో చలికాలం పెరిగే కొద్దీ ఈ కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
-
Diwali: దీపావళి గాయాలు.. ఆస్పత్రులకు తెలుగు రాష్ట్రాలు క్యూ..!
-
Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
-
ECB: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
-
Penugonda Farmers: తుఫాన్ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!