Flight Journey: ఊబకాయ మహిళలకు అవమానం.. ఫ్లైట్ నుంచి దించివేత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊబకాయం ఆ మహిళలకు శాపమైంది. సాఫీగా ప్రయాణం సాగించాలని విమానం ఎక్కిన ఇద్దరు మహిళలకు విమాన సిబ్బంది నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. భారీ కాయంతో ఉన్నారన్న కారణంతో ఏకంగా ఫ్లైట్ నుంచి దించేసి అవమానించారు. ఈ ఘటన ఎయిర్ న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీన జరిగిన ఈ వ్యవహారంపై సదరు విమానయాన సంస్థ స్పందించింది. ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించింది.
ఏంజెల్ హార్డింగ్ అనే మహిళ స్నేహితురాలితో కలిసి నేపియర్ నుంచి ఆక్లాండ్‌కు బయలుదేరారు. విమానం రన్‌వేపైకి చేరుకున్న సమయంలో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. ఎందుకని వారు ప్రశ్నించగా.. సరైన స్థితిలో కూర్చునేంత వరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అటెండెంట్ అమర్యాదకరంగా, దురుసుగా వ్యవహరించిందని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విమానం కదులుతుండగా కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టాలని వారిని కోరడంతో.. సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించినట్లు చెప్పారు. ఈ పరిణామంతో షాక్‌కు గురయ్యామని బాధిత మహిళ వాపోయారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
విమానంలో ఈ వివాదం చోటుచేసుకోవడంతో తిరిగి బోర్డింగ్ ప్రదేశానికి ఫ్లైట్ వచ్చేసింది. అసౌకర్యం కారణంగా ప్రయాణికులంతా కిందకు దిగిపోవాలని సిబ్బంది కోరారు. తిరిగి విమానంలోకి ఎక్కించుకొనే క్రమంలో బాధిత మహిళలను మాత్రం విమానంలోనికి అనుమతించలేదు. ఎందుకని ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలని సూచించి వెళ్లిపోయారు. ఎందుకు ఎక్కించుకోవడంలేదో మాత్రం స్పష్టంగా చెప్పకుండానే విమానం అక్కడి నుంచి వెళ్లిపోయింది. తమ శరీర ఆకృతి, అధిక బరువు కారణంగానే తమను దించేశారని అర్థమైనట్లు సదరు మహిళ వాపోయారు. ఇలాంటి అవమానకర పరిస్థితి మరెవ్వరికీ ఎదురుకాకూడదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై బాధిత మహిళలు ఫిర్యాదు చేయడంతో సదరు విమానయాన సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టికెట్ డబ్బులు వాపస్ చేయడంతో పాటు ఆరోజు స్థానికంగా బస కల్పించినట్లు వెల్లడించింది. అలాగే వారికి ఎదురైన చేదు ఘటనకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులతో హుందాగా నడుచుకునేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!