Canada flight: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. గాల్లో ఉండగా మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్ కెనడాకు భారీ ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్దగా మంటలు కనిపించాయి. పేలుడు జరగగానే విమానం రెక్కల దగ్గర మంటలు చెలరేగాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌లు గాల్లోకి లేచిన 30 నిమిసాల్లోనే విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. పేలుడు జరిగి మంటలంటుకున్న సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 400 మంది దాకా ఉన్నారు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఘటన జరిగినపుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. మరోపక్క వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విమానాన్ని సురక్షితంగా వెనకకు మళ్లించి ల్యాండ్ చేసిన పైలట్‌లను అందరూ అభినందించారు.
జూన్ 5 సాయంత్రం ఈ పేలుడు ప్రమాదం జరిగింది. విమానం పారిస్‌కు వెళ్తుండగా మంటలు అంటుకున్నాయి. విమానం రన్‌వేపై నుంచి పైకి లేచిన ముప్పై నిమిషాలకే ఈ ఘటన జరిగింది. విమానం రాత్రి 8:46 గంటలకు దాని స్థానం నుంచి బయలుదేరింది. తిరిగి టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో రాత్రి 9:50 గంటలకు ల్యాండ్ చేశారు.
Superb work by the pilots and their air traffic controllers, dealing with a backfiring engine on takeoff. Heavy plane full of fuel, low cloud thunderstorms, repeated compressor stalls. Calm, competent, professional – well done!
Details: https://t.co/VaJeEdpzcn @AirCanada pic.twitter.com/7aOHyFsR29— Chris Hadfield (@Cmdr_Hadfield) June 7, 2024
Also Read
తాజావార్తలు
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్‌కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..