ఎయిర్ కెనడాకు భారీ ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది.