Nagpur: మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ సమీపంలో 52 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి మద్యం మత్తులో పులిని మచ్చిక చేసుకుని తన మందు బాటిల్ నుంచి తాగించే ప్రయత్నం చేసిన వీడియో వైరల్ అయింది. ఆయన అలా చేసి ఎలాంటి హాని లేకుండా తప్పించుకున్నాడని చెప్పే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. ఈ వీడియో లియన్ల వ్యూస్ పొందింది. క్యాప్షన్ ప్రకారం, రాజు పటేల్ పేకాట ఆడి..తాగిన మత్తులో రోడ్డుపైకి వచ్చాడు. అక్కడ పెద్ద పులి కనిపించగానే, దాన్ని పిల్లిగా భావించి నిమిరాడట. పులి మెడపై చేయి వేసి, తన మందు బాటిల్‌ను ముక్కుకు దగ్గరగా తీసుకెళ్లి తాగించేలా ప్రయత్నం చేశాడట. పులి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా వెళ్లిపోయిందని, రాజు సేఫ్‌గా తప్పించుకున్నాడని వీడియోలు చూసి ప్రచారం చేశారు.
READ MORE: Mini Countryman SE All4: మార్కెట్ లోకి మినీ కంట్రీమాన్ SE All4 ఎలక్ట్రిక్ SUV.. 440KM రేంజ్..
కానీ.. ఇక్కడే ఓ ట్విస్ట్ బయటపడింది. నాగ్‌పూర్ జిల్లా పోలీసులు ఈ వీడియో షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కు నోటీసు జారీ చేశారు. ఇది కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో తయారు చేసిన వీడియో అని స్పష్టం చేశారు. ఓ వ్యక్తి పులికి మద్యం తాగిస్తున్నట్లు చూపే.. ఈ క్లిప్ తప్పుడు సందేశాన్ని పంపుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఇది వన్యప్రాణుల అభయారణ్యం, ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని ఓ అధికారి తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ రీల్ అక్టోబర్ 30న పోస్ట్ చేశారు. అది ఏఐ వీడియో అని పోలీసుల ధృవీకరణలో వెల్లడైంది. “ఈ రీల్ తప్పుడు సందేశాన్ని పంపుతుంది. టైగర్ రిజర్వ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. ఇది పర్యాటకులలో గందరగోళాన్ని కూడా సృష్టించవచ్చు. ఇది వన్యప్రాణులపై తప్పుదారి పట్టించే చర్య.” అని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.