Ajit Agarkar: ధావన్ కాకా నీకు లేదు చోటు.. అన్ని సర్దుకో ఇక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డేల్లో అద్భుతమైన రికార్డులు సృష్టించిన టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు కెప్టెన్‌గా టీమ్ ను ముందుకు నడిపించి శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు. మేటి ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే, కొత్త నీరు రాగానే.. పాత నీరు పోవాలన్న చందంగా.. శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ లాంటి యువ బ్యాటర్లు ఇచ్చిన పోటీ ముందు 37 ఏళ్ల గబ్బర్ నిలవలేకపోయాడు. మెరుగైన ప్రదర్శనలతో వీరిద్దరు ఓపెనర్లుగా తమ స్థానం సుస్థిరం చేసుకుంటున్న క్రమంలో ధావన్‌కు ఛాన్స్ లు కరువయ్యాయి.
Read Also: Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
అయితే.. ఇటీవల వీరిద్దరు ఫేయిల్ అవుతుండటంతో ఆసియా కప్-2023 రూపంలో గబ్బర్‌కు మరో అవకాశం దక్కుతుందని అతడి ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ.. బీసీసీఐ సెలక్టర్లు వాళ్ల ఆశలపై చల్లని నీళ్లు చల్లారు. ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా శుభ్ మన్ గిల్‌ను ఎంపిక చేశారు. ఇషాన్ కిషన్‌కు కూడా టీమ్ లో స్థానం కల్పించారు. ఈ క్రమంలో గబ్బర్‌కు మరోసారి నిరాశే మిగిలింది. జట్టు ప్రకటన టైంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. శిఖర్ ధావన్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ లు ఎన్నో ఆడాడు. అయితే, ప్రస్తుతం.. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లనే ఓపెనర్లుగా మా తొలి ప్రాధాన్యమని ఆయన చెప్పాడు.
Read Also: Csk Released Ben Stokes: మాకు నీవొద్దు స్టోక్స్ బాబాయ్.. ప్యాట్ కమిన్స్ పై కన్ను..!
ఇక, ఆసియా కప్ జట్టే వన్డే ప్రపంచ కప్ ప్రొవిజినల్ టీమ్ అన్న అంచనాల మధ్య శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు.. సెలక్టర్ల విషయంలో ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు.. జట్టుకు అవసరమైన టైంలో 100 శాతం కష్టపడ్డాడు అని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. గబ్బర్‌ను తలచుకుంటే బాధేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, టీమిండియా తరఫున శిఖర్ ధావన్.. 167 వన్డేలు ఆడి 6, 793 రన్స్ చేశాడు. ఇందులో17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి.
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!