US Credit Rating: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బుధవారం కుదేలయ్యాయి. దీంతో ప్రపంచంలోని టాప్ 22 బిలియనీర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ప్రపంచంలోని టాప్ 22 బిలియనీర్ల సంపద ఏకకాలంలో క్షీణించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ బిలియనీర్ల సంపద ఏకంగా రూ. 3 లక్షల కోట్లకు పైగా తగ్గింది.. అంటే ఇది 36 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ఇందులో ఎలోన్ మస్క్ , బెర్నార్డ్ ఆర్నాల్ట్ చాలా నష్టపోయారు. ఇండియాలో అంబానీ, అదానీతో సహా టాప్ 14 మంది బిలియనీర్ల సంపద తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఎవరి సంపద ఎంత తగ్గిందో చూద్దాం..
ప్రపంచంలోని అగ్రశ్రేణి 22 మంది బిలియనీర్ల సంపద ఒక లైన్‌కు పడిపోయిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.. కానీ ఇది బుధవారం సాధ్యమైంది. ఎలోన్ మస్క్ నుంచి గౌతమ్ అదానీ వరకు ప్రపంచంలోని 22 మంది బిలియనీర్ల సంపద రూ.3 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. డాలర్లలో చూస్తే దీని విలువ 36 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ఈ జాబితాలో ఎలోన్ మస్క్‌తో పాటు బెజోస్, జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, అంబానీ, అదానీలు కూడా ఉన్నారు.
Read Also:Aqua Marine: ఆక్వా మెరైన్ కు వ్యతిరేకంగా గళం విప్పిన సినీ ప్రముఖులు…
టాప్ 10 బిలియనీర్లలో ఎలోన్ మస్క్ సంపదలో అతిపెద్ద క్షీణత కనిపించింది. బుధవారం నాడు, మస్క్ నికర విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు తగ్గి 233 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మస్క్ నికర విలువ వరుసగా రెండో రోజు క్షీణించింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 4 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. జెఫ్ బెజోస్ సంపద 3.52బిలియన్ డాలర్లు తగ్గింది. వారెన్ బఫెట్ సంపద 416 మిలియన్ డాలర్ల నష్టం జరిగింది. కాగా, లారీ ఎలిసన్, లారీ పేజ్, మార్క్ జుకర్‌బర్గ్, స్టీవ్ బాల్మర్, సెర్గి బ్రిన్‌ల సంపద 2 నుంచి 3 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది.
మరోవైపు అంబానీ, అదానీల సంపదలో కూడా క్షీణత నెలకొంది. ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సంపద 1.27 బిలియన్ డాలర్లు తగ్గింది. ఆ తర్వాత అతని మొత్తం సంపద 94.5 బిలియన్ డాలర్లకు తగ్గింది. గౌతమ్ అదానీ సంపద 1.08 బిలియన్ డాలర్లు తగ్గగా, మొత్తం నికర విలువ 62.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. వీరిద్దరూ కాకుండా షాపూర్ మిస్త్రీ, శివ్ నాడార్ అజీమ్ ప్రేమ్ జీ, లక్ష్మీ మిట్టల్ వంటి 19 మంది బిలియనీర్ల సంపదలో క్షీణత నెలకొంది. కాగా 4 బిలియనీర్ల సంపద పెరిగింది.
Read Also:Ravindranath-Gayatri: చిక్కుల్లో పన్నీరు సెల్వం కొడుకు.. మహిళ దెబ్బకు ప్రమాదంలో ఎంపీ పోస్టు