Site icon NTV Telugu

Test Retirement: రోహిత్, విరాట్ తరవాత.. మరో సీనియర్ ఆటగాడి టెస్ట్ కెరియర్ కూడా ముగిసినట్టేనా?

Ro Ko

Ro Ko

Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్‌, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో సీనియర్ ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టెస్ట్ బృందంలో స్థానం కోల్పోబోతున్నాడని తాజా సమాచారం.

Read Also: Team India Captain: జస్ప్రీత్ బుమ్రా కాదు.. టీమిండియా కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

కొన్ని నివేదికల వివరాల ప్రకారం, గాయాల సమస్యలతో బాధపడుతున్న షమీ ఇప్పుడిప్పుడే ఆటకు తిరిగివస్తున్నా, అతడి ఫిట్‌నెస్ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత అతడు కాలి గాయం కారణంగా 2024 సంవత్సరం మొత్తం ఆడలేకపోయాడు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిరిగి బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, ఇప్పుడున్న ఐపీఎల్‌ పోటీల్లోనూ ఆడుతున్నాడు. అయితే, బీసీసీఐకి షమీ ఆటోమేటిక్ పిక్ కాదు. దీనికి కారణం అతడు బౌలింగ్‌లో రిథమ్ కోల్పోయాడు. ఐపీఎల్ లో కూడా అతడి రన్‌ అప్ పూర్తిగా కుదురుకోవడం లేదు. బంతి కీపర్‌ వద్దకు తేలికగా చేరడం లేదు. చిన్న స్పెల్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి.

Read Also: BrahMos: పాకిస్తాన్‌‌పై “బ్రహ్మోస్‌”తో భారత్ దాడి.!

ఈ దెబ్బతో మరో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ ను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం, ఇటీవలి కాలంలో వీపు గాయంతో చికిత్స తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల్లోనూ షమీ అందుబాటులో ఉంటే మంచిదే కానీ, అతడూ పూర్తిగా సరైన ఫామ్‌లో లేకపోతే బుమ్రాను విశ్రాంతి ఇవ్వడం కష్టమవుతుంది. ఇందుకు సంబంధించి ఓ బీసీసీఐ వ్యక్తి మాట్లాడుతూ.. బుమ్రా లేకపోతే షమిని బరిలోకి దింపాలన్నది అసలు ప్లాన్. కానీ, ఇప్పుడు షమీ సైతం పూర్తి స్పెల్స్ చేయలేకపోతే, ఆ బలాన్స్ తప్పుతుంది. అందుకే షమి సమస్య ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పరిశీలిస్తున్నారన్నారు. దీన్ని బట్టి చూస్తే రోహిత్, విరాట్ తరవాత.. షమీకి కూడా రిటైర్మెంట్ దగ్గర పడిందని అర్థమవుతుంది.

Exit mobile version