Asia Cup 2025-India: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం.. టీ20 ఫార్మాట్లో టోర్నీ!
- ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం
- 1984లో ఆసియా కప్ మొదలు
- 2023లో హైబ్రిడ్ విధానంలో టోర్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India to host 2025 Asia Cup in T20 Format: 2025లో జరగనున్న పురుషుల ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. 1984లో ఆసియా కప్ మొదలవ్వగా.. చివరిగా భారత్ 1991లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత భారత్ గడ్డపై టోర్నీ జరగలేదు. 34 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది.
2026లో టీ20 ప్రపంచకప్ ఉండటంతో 2025 ఆసియా కప్‌ను పొట్టి ఫార్మాట్లో నిర్వహించాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. 2016 నుంచి ఈ మెగా ఈవెంట్.. ప్రపంచకప్ పోటీకి సన్నాహక టోర్నమెంట్‌గా ఉపయోగపడుతోంది. ప్రపంచకప్ ఫార్మాట్‌ను బట్టి ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. 2027లో ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. ఎందుకంటే.. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉంటుంది.
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Also Read: Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!
ఆసియా కప్ 2025కి సంబంధించి మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. భారత్‌లో వర్షాకాలం ముగిసిన అనంతరం సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననుండగా.. 13 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌తో పాటు మరో జట్టు పాల్గొననుంది. 2023లో ఆసియా కప్‌ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించగా.. వన్డే ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇచ్చింది. అత్యధికంగా బంగ్లాదేశ్ అయిదు సార్లు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది.
తాజావార్తలు
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!