NTV Telugu Site icon

Bihar: ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి.. దగ్గరుండి పెళ్లి చేసిన భర్త!

Bihar

Bihar

బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: Youtuber Arrest: యూట్యూబర్ భానుచందర్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ ఘటన సహర్సాలోని బైజ్నాథ్పూర్ గ్రామంలో జరిగింది. ఓ యువకుడు 12 సంవత్సరాల క్రితం రహువా తులసియాహి గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి కుటుంబాలు అంగీకరించలేదు. వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతా మామూలుగానే సాగుతోంది. ఇంతలో ఆమె అదే గ్రామంలోని మరో వ్యక్తిపై మనసు పారేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఈ జంట ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో ఈ యువకుడు సహాయం చేశాడు. అప్పటికే నుంచి ఈ మహిళతో సాన్నిహిత్యం పెరిగి.. క్రమంగా ప్రేమకు దారితీసింది.

READ MORE:Rahul Gandhi: అంబేద్కర్‌ని అవమానిస్తే దేశం సహించదు..

డిసెంబర్ 16వ తేదీ రాత్రి, యువకుడు మహిళ ఇంటికి చేరుకున్నాడు. వీరిద్దరూ బెడ్‌రూంలో ఉండగా.. మహిళ భర్త హఠాత్తుగా ఇంటికి వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వారిని పోలీసుల ఎదుట హాజరుపరిచాడు. తన ప్రేమ వ్యవహారాన్ని అందరి ముందు ఒప్పుకున్న యువతి అతడితోనే కలిసి జీవిస్తానని చెప్పింది. దీంతో వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. రెండోసారి ప్రేమ వివాహం చేసుకున్న.. ఆ మహిళ ముగ్గురు పిల్లలను భర్త వద్దే వదిలేసింది. మొదటి భర్త వద్ద ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. గ్రామస్థుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మొత్తం ఘటనపై ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు.