బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.