Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!
- పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం
- 14 మంది పాకిస్థాన్ సైనికులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం నాడు పాకిస్థాన్‌కు చెందిన ఒక కీలక సైనిక స్థావరంపై తమ వైమానిక దళం దాడి చేసిందని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ‘X’ వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. ఆఫ్ఘన్ దళాలు జరిపిన ఈ మెరుపు దాడిలో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో14 మంది పాకిస్థాన్ సైనికులు మరణించగా, 11 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో ఒక సాయుధ ట్యాంక్, ఒక అంతర్జాతీయ రవాణా వాహనంతో పాటు సైనిక స్థావరం పూర్తిగా ధ్వంసమైంది. పాకిస్థాన్ సైనిక పాలన కొనసాగిస్తున్న అకృత్యాలకు నిరసనగానే ఈ ప్రతిదాడికి దిగినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
READ ALSO: PM Modi: కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్పితే, చేసేదేం లేదు..
Also Read
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
పాక్ సైనిక పోస్టు ఆక్రమణ..
కేవలం దాడులతోనే సరిపెట్టకుండా, డ్యూరాండ్ లైన్ సమీపంలోని పాకిస్థాన్ సైనిక పోస్టును కూడా తమ భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని ఆఫ్ఘనిస్థాన్ ప్రకటించింది. కునార్, నంగర్హార్ ప్రావిన్సుల తూర్పు ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా వివాదాస్పద డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరువైపుల నుంచి మోర్టార్ కాల్పులు, వైమానిక దాడులు నిరంతరం కొనసాగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజా దాడి నేపథ్యంలో పాకిస్థాన్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.
🚨 Retaliation
In response to the crimes committed by the Pakistani military regime, Afghan Defense Forces carried out operations along the Durand Line in the eastern zone of Kunar and Nangarhar provinces. During the operation…
— د ملي دفاع وزارت – وزارت دفاع ملی (@MoDAfghanistan2) March 14, 2026
తాజావార్తలు
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!