Deepa Thomas: స్టేజ్ మీదే ఏడ్చేసిన ‘రావు బహదూర్’ హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepa Thomas: వైవిధ్యమైన నటనతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సత్యదేవ్ పుట్టినరోజు వేడుకలు ఒకవైపు, ఆయన నటించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’ థియేటర్లలో సాధిస్తున్న ఘన విజయం మరోవైపు.. వెరసి చిత్ర యూనిట్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక సక్సెస్ మీట్లో పాల్గొన్న ఈ సినిమా దీపా థామస్ స్టేజ్ పైనే తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాలో ‘రేణుక’ అనే అద్భుతమైన పాత్రను పోషించిన ఆమె, తన మనసులోని మాటలను పంచుకుంటూ భావోద్వేగ భరిత ప్రసంగం చేశారు. స్టేజ్ పైకి రాగానే దీపా థామస్ మొదటగా హీరో సత్యదేవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “ఈ పరిశ్రమలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన నటులలో సత్యదేవ్ ఒకరు. ఆయనతో కలిసి పనిచేయడం నా జీవితంలో ఎప్పటికీ గర్వకారణంగా నిలిచిపోతుంది. ‘రావు బహదూర్’ సినిమాలో ఆయన చేసిన పాత్ర అత్యంత అద్భుతమైనది. ఈ క్యారెక్టర్‌కు ఆయనకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
“నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు అవుతోంది. కానీ ఇలాంటి ఒక గొప్ప అవకాశం కోసం ఎప్పటినుంచో కలలు కన్నాను. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడు మహా ఒకరోజు నాకు ఫోన్ చేసి, తన నెక్స్ట్ సినిమా ఆడిషన్ కోసం ప్రొఫైల్ పంపమన్నప్పుడు నా చెవులను నేనే నమ్మలేకపోయాను. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఏదైనా ఉందంటే అది ‘రావు బహదూర్’ సినిమాలో భాగం కావడమే. నాకు ఈ ‘రేణుక’ పాత్రను ఇచ్చినందుకు మహా గారికి జీవితాంతం రుణపడి ఉంటాను” అని దీపా థామస్ ఎమోషనల్ అయ్యారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
సినిమా నిన్ననే థియేటర్లలోకి రాగా, ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. “థియేటర్లలో నిజమైన ఆడియన్స్ స్పందన చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రేక్షకులు సినిమాతో పాటు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, ప్రతి ఎమోషన్‌కు కనెక్ట్ అవుతున్నారు. మా తల్లిదండ్రులకు తెలుగు రాదు. నిన్న వాళ్లు సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా చూశారు. వాళ్లు సినిమా చూస్తూ ఎమోషనల్ అవ్వడం నన్ను ఎంతగానో గర్వపడేలా చేసింది. గతంలో నా నటన చూసి ‘ఇంకా బాగా చెయ్ దీపా’ అనే నాన్న, ఈ సినిమా చూసి ‘నీ కెరీర్లోనే బెస్ట్ ఫిలిం చేశావు’ అని మెచ్చుకున్నారు. ఆ మాటలు నా జీవితంలో అత్యంత విలువైనవి” అంటూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. దర్శకుడు మహా గారు ఎప్పుడూ తనను బలహీనతను చూపించవద్దని చెబుతుంటారని, కానీ ఈ సంతోషంలో ఏడ్చేయకుండా ఉండలేకపోయానని ఆమె క్షమాపణలు కోరారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!