Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని కాబూల్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదించింది. జర్మన్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 177 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురవుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపాలు అత్యంత ప్రాణాంతకమైనవిగా నిపుణులు పేర్కొంటున్నారు. సగటున, ప్రతి సంవత్సరం భూకంపాల కారణంగా సుమారు 560 మంది మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో నవంబర్‌లో సంభవించిన భూకంపం 6.3 తీవ్రత గల శక్తివంతమైనది నమోదై, కనీసం 27 మందిని బలిగొని, వందలాది ఇళ్లను ధ్వంసం చేసింది.
READ ALSO: Off The Record: బీఆర్ఎస్ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
భారత రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాల్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి సుమారు 9:50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు పంజాబ్‌లోని నోయిడా, చండీగఢ్, లుధియానా, జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్‌తో పాటు డెహ్రాడూన్, ఇతర నగరాల్లో కూడా సంభవించాయి. చండీగఢ్‌లో పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “కొన్ని సెకన్ల పాటు బలమైన భూకంపం వచ్చింది” అని చెప్పారు. చాలా మంది ఈ భూకంప వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన ఒక సోషల్ మీడియా యూజర్, “ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ప్రజల ఇళ్లలోని ఫ్యాన్లు, మంచాలు కూడా వణకడం ప్రారంభించాయి” అని రాసుకొచ్చారు. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లోని బదఖ్షాన్ ప్రావిన్స్‌లో, పాకిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దుకు సమీపంలో హిందూ కుష్ ప్రాంతంలో ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పెషావర్, ఇతర ప్రాంతాలతో సహా పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో కూడా కొద్దిసేపు ప్రకంపనలు సంభవించాయని నివేదికలు తెలిపాయి.
READ ALSO: Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?