AFG vs SA: రికార్డులను బద్దలు కొడుతున్న ఆఫ్ఘనిస్తాన్.. దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం
- రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 177 పరుగుల భారీ విజయాన్ని నమోదు.
- మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం.
- దింతో ఆఫ్ఘనిస్తాన్ తమ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AFG vs SA: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 20) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 177 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రహ్మానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దింతో ఆఫ్ఘనిస్తాన్ తమ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. రెండో వన్డేలో 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 311/4 భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ప్రోటీస్ 34.2 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. దింతో ఆఫ్ఘనిస్తాన్ వన్డేలలో పరుగుల పరంగా వారి అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Maharastra : పాల్ఘర్ కెమికల్ కంపెనీలో మంటలు… ఆరుగురు ఉద్యోగులు సజీవ దహనం
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ఈ నేపథ్యంలో నాలుగవ ODI సిరీస్‌ను గెలుచుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. అంతకుముందు బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్‌లపై వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. షార్జా మైదానంలో జరిగిన సిరీస్‌లో రెండో వన్డే మ్యాచ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాట్‌తో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు విజయాన్ని అందించగా, రషీద్ ఖాన్ బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇందులో రహ్మానుల్లా గుర్బాజ్ ఇన్నింగ్స్ 105 పరుగులు, ఒమర్జాయ్ అజేయంగా 86 పరుగులు, రహ్మత్ షా 50 పరుగులు చేసారు. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా జట్టు 34.2 ఓవర్లలో 134 పరుగులకే పరిమితమై 177 పరుగుల భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వన్డే చరిత్రలో పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌కు ఇదే అతిపెద్ద విజయం.
IAS Officer: మాజీ ఐఏఎస్‌ని చుట్టుముట్టిన ఈడీ.. 42 కోట్ల 85 లక్షల నగదు స్వాధీనం..
పరుగుల తేడాతో వన్డేల్లో ఆఫ్ఘనిస్థాన్‌కు అతిపెద్ద విజయాలు..
177 పరుగులు – vs సౌతాఫ్రికా (షార్జా, సంవత్సరం 2024)
154 పరుగులు – vs జింబాబ్వే (షార్జా, 2018)
146 పరుగులు – vs జింబాబ్వే (షార్జా, 2018)
142 పరుగులు – vs బంగ్లాదేశ్ (ఛటోగ్రామ్, సంవత్సరం 2023)
138 పరుగులు – vs ఐర్లాండ్ (షార్జా, 2017)
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!